పెళ్లి అనేది ఒక రోజు కార్యక్రమం కాదు — అది రెండు కుటుంబాల మధ్య ఏర్పడే పవిత్రమైన జీవిత బంధం. ఏడు అడుగులు లో, మేము ప్రతి పెళ్లిని సంప్రదాయానికి తగ్గట్టుగా, వైదిక పద్ధతుల్లో, పూర్తి బాధ్యతతో నిర్వహిస్తాము. మీరు ఆనందంగా ఉండండి… మీ పెళ్లి బాధ్యత మాకే వదిలేయండి.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో సంప్రదాయ, వైభవమైన పెళ్లి కార్యక్రమాల నిర్వహణలో నమ్మకమైన పేరు. మా లక్ష్యం ఒకటే — ప్రతి పెళ్లి కుటుంబానికి గర్వకారణంగా, వధూవరులకు జీవితాంతం మధుర జ్ఞాపకంగా మారాలి. సంప్రదాయం, సంస్కారం, సమయపాలన మా సేవల పునాది.
సంప్రదాయాలపై పూర్తి అవగాహన
అనుభవజ్ఞులైన టీమ్
నాణ్యతలో రాజీ లేదు
ప్రతి కార్యక్రమంపై వ్యక్తిగత శ్రద్ధ
కుటుంబ సభ్యుల్లా సేవ
పెళ్లి కార్యక్రమం మొదలుకొని చివరి కార్యక్రమం వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేసి సజావుగా నిర్వహించడం మా బాధ్యత.
పెళ్లి వేదిక అందంగా కనిపించాలంటే సరైన అలంకరణ & వెలుగులే ప్రధానమైనవి.
అతిథులు సౌకర్యంగా ఉండేలా పందిరి & కూర్చోవడానికి పూర్తి ఏర్పాట్లు.
పెళ్లిలో భోజనం కుటుంబ గౌరవానికి ప్రతీక. మేము సంప్రదాయ రుచితో అత్యుత్తమ కేటరింగ్ అందిస్తాము.
వైదిక విధానంలో పెళ్లి కార్యక్రమాలు సక్రమంగా జరగాలంటే అనుభవజ్ఞులైన పంతులు అత్యవసరం.
WhatsApp us